బనవాసి గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్ఐ శ్రీనివాసులు

ఎమ్మిగనూరు మండలంలోని బనవాసి గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్లు గ్రామంలో తిరుగుతున్నారని, వారిని గుర్తించకుండా హెల్మెట్ ధరిస్తారని, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. మల్కాపురం, కోటేకల్లు గ్రామాల్లోనూ ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕