అలవాల ఎస్సీ కాలనీ పాఠశాలలో ప్రశాంతంగా ఎస్ఎంసీ ఎన్నిక

గోనెగండ్ల మండలం అలవాల గ్రామంలోని ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో వాయిదా పడిన ఎస్ఎంసీ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికలో చైర్మన్ గా ఫిలిప్, వైస్ చైర్మన్ గా కక్కిన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సోషల్ ఆఫీసర్లు, పోలీసు సిబ్బంది, గ్రామ టీడీపీ, వైసీపీ నాయకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕