ఆదోని: రూ. 10 లక్షల విలువైన 12 దొంగ బైక్‌లు స్వాధీనం

ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీగా దొంగిలించిన మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. శుక్రవారం సిఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా బైక్‌పై వెళ్తున్న హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31)ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆదోని వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్, తాలూకా, పత్తికొండ ప్రాంతాల్లో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. అతని సమాచారంతో ఆదోని-ఆస్పరి కొత్త బైపాస్ సమీపంలోని రహస్య ప్రదేశంలో దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్