ఆదోని: ఆర్టీసీ కాలనీలో నేలకొరిగిన భారీ వృక్షం

ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ కాలనీ ముఖద్వారం వద్ద మంగళవారం భారీ వృక్షం కూలిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఈ ఘటనతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ పార్కు పక్కన ఉన్న ఈ చెట్టు కూలి పార్కు గోడతో పాటు సమీపంలోని విద్యుత్ తీగలపై పడింది. దీంతో ఆర్టీసీ కాలనీ, శ్రీనగర్, విట్టాకిష్టప్ప నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ అంతరాయం కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. అదృష్టవశాత్తు, చెట్టు కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

సంబంధిత పోస్ట్