ఆదోని: ఏబీఎన్ రాధాకృష్ణ‌ను త‌క్ష‌ణ‌మే అరెస్ట్ చేయాలి. బుట్టా రేణుక,

వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్‌ ఇన్‌చార్జి బుట్టా రేణుక, ఏబీఎన్ రాధాకృష్ణ మహిళలను, వైఎస్సార్సీపీ నాయకులను కించపరిచేలా మాట్లాడారని ఆరోపించారు. గురువారం ఆదోనిలో ఆమె మాట్లాడుతూ, రాధాకృష్ణ దిగజారుడు వ్యాఖ్యలను సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు సమర్థించడం చూస్తుంటే, ఇది యాదృచ్చిక వ్యాఖ్యలు కాదని, వైఎస్సార్సీపీ నాయకుల వ్యక్తిత్వ హననం చేసే కుట్రలో భాగంగా జరిగిన పన్నాగమని ఆమె అభిప్రాయపడ్డారు. రాధాకృష్ణ మహిళలకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్