ఆదోని: జగనన్న కాలనీల్లో అవినీతి... ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపణలు

ఆదోని పట్టణ శివారులో జగనన్న కాలనీల పేరుతో గత ప్రభుత్వ హయాంలో భారీ అవినీతి జరిగిందని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆరోపించారు. గురువారం కాలనీ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన ఆయన, గతంలో రూ. 24 కోట్లు మంజూరు చేస్తే, రైతులకు రూ. 8 కోట్లు మాత్రమే చేరాయని, మొత్తం రూ. 128 కోట్ల అవినీతి జరిగినట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. సుమారు 5 వేల కుటుంబాలను మోసం చేశారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్