ఫోర్జరీ డాక్యుమెంట్లతో రూ. 3.24 కోట్ల రుణం పొందేందుకు సహకరించిన మహా యోగి లక్ష్మమ్మవ్వ కోఆపరేటివ్ బ్యాంకు మాజీ సీఈవో గట్టు మురళీకుమార్ ను ఆదోని వన్ టౌన్ సీఐ శ్రీరామ్ బుధవారం అరెస్టు చేశారు. బ్యాంకు చైర్మన్ రాయచోటి సుబ్బయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు సబ్ రిజిస్ట్రార్ సంతకాలు, నకిలీ సీల్ తో డాక్యుమెంట్లను తయారు చేసి బ్యాంకును తప్పుదోవ పట్టించడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.