పేద బ్రాహ్మణుల మరణానంతర కర్మకాండల నిర్వహణకు గరుడ పథకం ద్వారా రూ. 10 వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. శుక్రవారం ఆదోనిలో బీజేపీ నాయకులు వెల్లాల మధుసూధన శర్మ, కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. పేద బ్రాహ్మణ కుటుంబాలకు ఇది ఉపశమనం కలిగిస్తుందని, ఈ పథకం అమలుకు కృషి చేసిన ఎమ్మెల్యే పార్థసారధిని వారు అభినందించారు.