ఆదోని పట్టణంలోని బంగారు బజార్ వ్యాపారులు గురువారం స్వచ్ఛందంగా బంద్ పాటించారు. సీనియర్ స్వర్ణ వ్యాపారి కుబేర్నాథరావు మృతి చెందడంతో, ఆయనకు సంతాపంగా ఈ బంద్ ప్రకటించినట్లు వ్యాపార సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలోని దుకాణాలను మూసివేసి, ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.