ఆదోని: ఆర్టీసీ బస్సులో బంగారు ఆభరణాల చోరీ

ఆదోని–హొళగుంద ఆర్టీసీ బస్సులో బుధవారం చోరీ జరిగింది. నాగనాథనహళ్లి గ్రామానికి చెందిన రేణుకమ్మ అనే మహిళ ప్రయాణిస్తుండగా, ఆమె బ్యాగులో ఉన్న రెండు తులాల బంగారు గొలుసు, చెవికమ్మలు కనిపించకుండా పోయాయి. దీంతో ఆమె బస్సును ఆపి విషయం తెలియజేయగా, ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ బస్సును రెండో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్