ఆదోని మండలంలోని పాండవగల్లు-కుప్పగల్లు గ్రామాల మధ్య బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లా బొమ్మనహళ్లి మండలం కురువళ్లికి చెందిన శ్రీనివాసరెడ్డి, లక్ష్మి దంపతులు గాయపడ్డారు. సింగరాజనపల్లికి వెళ్తుతుండగా, ఆర్టీసీ బస్సు వెనుక నుంచి తాకడంతో, వారి బైకు లారీని ఢీకొట్టింది. దీంతో వారు కింద పడి గాయలపాలయ్యారు. స్థానికులు గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.