ఆదోని పట్టణంలోని ప్రకాష్ నగర్ ప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్థి బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం ప్రకారం బజారి కుమారుడు లాజర్ పట్టణంలోని ఓ జూనియర్ కళాశాలలో చదువుతున్నాడు. రాత్రి ఆయన ఇంట్లో ఉరేసుకున్నట్లు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రెండవ పట్టణ పోలీసులు తెలిపారు.