ఆదోని: కురుబ–కురుమ సంఘ సమన్వయ కమిటీ సమావేశం

విజయవాడలో కురుబ-కురుమ రాష్ట్ర సంఘ సమన్వయ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. సంఘం అధ్యక్షుడు తట్టే అర్జున్ రావు, రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌కే మల్లికార్జున, వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ కురుబ–కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో అన్ని కులాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం పనిచేస్తోందని, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో అన్ని వర్గాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కురుబ కులానికి గుర్తింపు ఇచ్చి తనను చైర్మన్‌గా నియమించడం గౌరవంగా భావిస్తున్నానని దేవేంద్రప్ప పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్