ఆదోని: మహానాడును విజయవంతం చేయాలి: మాన్వి దేవేంద్రప్ప

తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న మహానాడును విజయవంతం చేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ–కురుమ కార్పొరేషన్ చైర్మన్, అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిశీలకుడు మాన్వి దేవేంద్రప్ప అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, టీడీపీ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 1, 875 క్లస్టర్లలో ‘శ్రీ శక్తి డిజిటల్ మహానాడు’ థీమ్‌తో మహానాడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మే 27, 28 తేదీల్లో జరిగే మహానాడులో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్