ఆదోని: రైలు కిందపడి వ్యక్తి మృతి

ఆదోని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్వీ - కుప్పగల్లు రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందినట్టు ఎస్సై గోపాల్ తెలిపారు. మృతదేహాన్ని పంచనామా అనంతరం శవపరీక్షకు శనివారం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు రైలు నుంచి పడిపోయి మృతి చెందినట్లు అనుమానిస్తున్నామని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్