ఆదోని: తాటి చెట్టుపై నుంచి జారిపడి వ్యక్తి మృతి

ఆదోని మండల పరిధిలోని పెద్దతుంబలం గ్రామ శివారులో బుధవారం తాటి చెట్టు పైనుంచి జారిపడి హుస్సేనప్పా (35) అనే వ్యక్తి మృతి చెందాడు. తాటికాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్