ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఆదోనిలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సీఎం హోదాలో ఉన్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, రాజకీయ విమర్శలకు, వ్యక్తిగత దూషణలకు తేడా తెలుసుకోవాలని హితవు పలికారు. అంబటి వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను దెబ్బతీసేవని పేర్కొంటూ, ఈ మేరకు ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.