ఆదోని: క్రీడాకారులతో క్రికెట్ ఆడిన ఎమ్మెల్యే పార్థసారథి

ఆటలు ఆడితే మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకున్నట్టే ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. శనివారం ఆదోనిలో సౌత్ ఇండియా టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి హాజరై, టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఆటలు ఆడటం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని, శారీరక ఫిట్‌నెస్ పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు.

సంబంధిత పోస్ట్