ఆదోని: ఉరివేసుకుని ఒరిస్సా మహిళ ఆత్మహత్య

ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సుహాసిని (25) గురువారం ఆదోనిలో ఆత్మహత్య చేసుకుంది. భర్త ఈశ్వర్ మహానంద్‌తో కలిసి ఆదోని మండలం ఆరేకల్లు సమీపంలోని ఇటుకల ఫ్యాక్టరీలో కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న ఆమె, కుటుంబ కలహాల కారణంగా భర్త లేని సమయంలో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తాలూక ఎస్సై రామాంజనేయులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్