ఆదోని: ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం, రూ. 37. 75 లక్షల నష్టం

ఆదోని పట్టణానికి చెందిన వై. పి. అరుణ్‌కుమార్ అనే యువకుడు ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టి మోసపోయాడు. శనివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సీతారామనగర్‌కు చెందిన అకౌంటెంట్ అరుణ్‌కుమార్ వాట్సాప్ ద్వారా వచ్చిన బాబా క్యాప్స్ వెబ్‌సైట్‌లో పెట్టుబడులు పెట్టి రూ. 37.75 లక్షలు కోల్పోయాడు. మొదట లాభాలు చూపించి, తర్వాత డబ్బు ఉపసంహరణకు రూ. 10.46 లక్షలు డిమాండ్ చేయడంతో మోసం వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్