ఆదోని: పుకార్ల వల్లే పెట్రోల్, డీజిల్ కొరత – నూర్ అహ్మద్

మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఆలూరు నూర్ అహ్మద్ బుధవారం మాట్లాడుతూ, రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉన్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా పుకార్లేనని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ పుకార్ల వల్ల ప్రజలు ఆందోళనకు గురై అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేస్తున్నారని, దీనిని కొందరు దుర్వినియోగం చేసుకుని వేలాది లీటర్ల పెట్రోల్, డీజిల్ నిల్వ చేసి బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్