ఆదోని మండలం ధనపురంలో ఎస్సీ సర్పంచ్ చంద్రశేఖర్‌ను అవమానించిన ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయలేదని దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు వినతిపత్రం అందజేశారు. జూన్ 16 నుంచి నిరసనలు తెలుపుతున్న అవమానించిన ఘటనపై కేసు నమోదు చేయలేదని, చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదన్నారు.