ఆదోని: వృద్ధురాలి పోగొట్టుకున్న బంగారం రికవరీ

ఆదోని పట్టణంలో వృద్ధురాలు కృష్ణమ్మ పోగొట్టుకున్న నాలుగు తులాల బంగారు ఆభరణాలను ఆదివారం వన్ టౌన్ పోలీసులు త్వరితగతిన రికవరీ చేసి బాధితురాలికి అప్పగించారు. మేదరగేరికి చెందిన కృష్ణమ్మ తన బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయని డయల్ 100కు ఫిర్యాదు చేయగా, వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అతి తక్కువ సమయంలోనే పోలీసులు పోగొట్టుకున్న బంగారు ఆభరణాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్