ఆదోని: ట్రాన్స్‌జెండర్ ఇంట్లో దోపిడీ.. నగదు, బంగారం చోరీ

ఆదోని పట్టణంలోని వైఎస్సార్ నగర్‌లో గురువారం ట్రాన్స్‌జెండర్ జాను ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చొరబడి 6.5 తులాల బంగారం, 16 తులాల వెండి వస్తువులు, రూ. 2 లక్షల నగదును దోచుకెళ్లారు. నిశ్చితార్థం అనంతరం భోజనం కోసం బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తిరిగి వచ్చేసరికి ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా ఉండటంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదోని 2-టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్