ఆదోని: వసతి లేక విద్యార్థులు చదువు మానేస్తున్నారు: ఎస్ఎఫ్ఐ

ఆదోని పట్టణంలో బీసీ హాస్టల్ లో దరఖాస్తు చేసిన విద్యార్థులకు వసతి కల్పించాలని, వసతి లేక విద్యార్థులు చదువు మానేస్తున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు శశిధర్ అన్నారు. సోమవారం ఆదోని పట్టణంలో ఏబీసీడబ్ల్యుఓ ఇంచార్జి శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. వెనుకబడిన ప్రాంతమైన ఆదోనిలో ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్