ఆదోని: ఇచ్చిన హామీలు అమలు చేయకుండా టీడీపీ కాలయాపన

ఆదోని పట్టణంలో శుక్రవారం వైఎస్సార్సీపీ నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారని, మోసానికి బ్రాండు అయ్యారన్నారు. వైఎస్ జగన్ పాలనలో ఆదోని అభివృద్ధికి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్