ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప సోమవారం ఆదోనిలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుజాతి గౌరవాన్ని ప్రపంచస్థాయిలో నిలబెట్టారని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటారని, రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని పరిస్థితుల్లో అమరావతిని రాజధానిగా ప్రకటించి అభివృద్ధి దిశగా ముందుకు నడిపారని పేర్కొన్నారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఇప్పటికీ అభివృద్ధి పట్ల అంకితభావంతో కృషి చేస్తున్నారని అన్నారు.