ఆదోని: రైతులకు సకాలంలో ఎరువులు అందిస్తున్న ప్రభుత్వం

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామ రైతు భరోసా కేంద్రాన్ని సోమవారం రాష్ట్ర కురుబ–కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప సందర్శించారు. రైతులకు ప్రభుత్వ నిర్ణయించిన ధరకు యూరియా ఎరువులు సకాలంలో అందుతున్నాయని ఆయన తెలిపారు. గ్రామానికి ఇప్పటికే సుమారు 1,200 యూరియా బస్తాలు చేరగా, మరిన్ని త్వరలో అందుబాటులోకి వస్తాయని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని దేవేంద్రప్ప రైతులకు భరోసా ఇచ్చారు. రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్