ఆదోని: ప్రపంచ మాస్టర్ అథ్లెటిక్స్‌లో క్రీడాకారిణుల ప్రతిభ

మంగళవారం ఆదోనిలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలని కోరారు. ఈ నెల 17 నుంచి 20 వరకు థాయిలాండ్‌లో జరిగిన ప్రపంచ మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడా పోటీల్లో ఆదోనికి చెందిన నీలం బండారి, హరిత కుమారి ఒక్కొక్కరూ మూడేసి పతకాలు సాధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారి ఇళ్లకు వెళ్లి అభినందించి, సన్మానించారు. క్రీడా రంగ అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా ప్రోత్సాహకాలు అందేలా చూస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్