ఆదోని: ఏరువాక పౌర్ణమిలో విషాదం విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

ఆదోని అర్బన్‌ పరిధిలోని కపటి గ్రామానికి చెందిన 15 ఏళ్ల సూరి బుధవారం విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. ఏరువాక పౌర్ణమి ఉండడంతో ఎద్దుల కొమ్ములకు కలర్ వేసి పక్కకు వచ్చి షెడ్ కు సపోర్టుగా ఉన్న యాంగ్లర్‌ను తాకడంతో విద్యుత్ షాక్ కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్