ఆదోని: వివాహేతర సంబంధం అనుమానం.. భర్తను హత్య చేసిన భార్య

ఆదోనిలో వివాహేతర సంబంధం అనుమానాలతో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. ఆదోనికి చెందిన మహేశ్‌ (40)ను అతని భార్య ఈరమ్మ హత్య చేసింది. 2013లో ప్రేమ వివాహం చేసుకున్న మహేశ్‌, ఈరమ్మల మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం అనుమానాలతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన మహేశ్‌తో మరోసారి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో భర్త తన సంబంధానికి అడ్డుగా మారాడని భావించిన ఈరమ్మ, మహేశ్‌ను ఇంటి పక్కనే ఉన్న తోటలోకి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్