ఆదోని: అనారోగ్యంతో మనస్తాపం.. యువకుడి ఆత్మహత్య

ఆదోని పట్టణంలోని క్రాంతినగర్‌కు చెందిన వీరేష్ (33) అనారోగ్యంతో మనస్తాపం చెంది ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం టూటౌన్ ఎస్ఐ రామనాథ్ తెలిపిన వివరాల ప్రకారం, కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో వీరేష్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా, మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరేష్‌కు భార్య సరస్వతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించారు.

సంబంధిత పోస్ట్