అరికేర: వివాహితపై వేధింపులు.. నిందితుడికి గ్రామస్తుల శిక్ష

కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికేర గ్రామంలో బుధవారం రాజశేఖర్ అనే వ్యక్తి ఓ వివాహితను వేధించాడని ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు తన బంధువులకు విషయం చెప్పడంతో వారు ఆగ్రహించి, నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అతనికి గుణపాఠం చెప్పేందుకు తల గుండు చేయించి, మెడలో చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్