బైచిగేరి ఎంపీటీసీ కిడ్నాప్?

ఆదోని పరిధిలోని బైచిగేరి ఎంపీటీసీ నాగభూషణ్ రెడ్డి కిడ్నాప్ పై పోలీసులు స్పందించడం లేదని ఆయన భార్య విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త ఆచూకీ తెలపాలంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి బోరున విలపించారు. రెండు రోజులుగా భర్త కనిపించలేదని రాతపూర్వకంగా తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆమె ఆరోపించారు. ఘటనపై ఎస్పీ, డీజీపీ స్పందించి దుండగుల బారి నుంచి భర్తను కాపాడాలంటూ ఆమె వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్