కర్నూలు సీ ప్లేన్ ప్రాజెక్టుపై అవగాహన లేకుండా విమర్శలు తగవు

సీ ప్లేన్ ప్రాజెక్టుపై పూర్తి అవగాహన లేకుండా సీఎం నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడం సమంజసం కాదని టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మ అన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ మంగళవారం ఆమె ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. సీ ప్లేన్ అనేది భూభాగంలో కాకుండా నీటి వనరులపై టేకాఫ్, ల్యాండింగ్ చేయగల ఆధునిక రవాణా వ్యవస్థ అని ఆమె వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా దూర ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధితో పాటు ప్రాంతీయ అనుసంధానానికి కూడా ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్