ఆదోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో, శిల్ప అపార్ట్‌మెంట్ ఎదురుగా ఉన్న అరుగుపై సోమవారం రాత్రి సుమారు 62 ఏళ్ల గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందాడు. మూడు రోజులుగా అక్కడే ఉంటున్న అతడు అనారోగ్యం, వృద్ధాప్యం లేదా వడదెబ్బతో మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడిని గుర్తించినవారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.