ఆదోని నియోజకవర్గంలో శుక్రవారం సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు, మాజీ ఎమ్మెల్యే కొంక మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు 45 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. రూ. 13 లక్షల రూపాయలకు పైగా విలువైన ఈ చెక్కులను బాధితులకు అందజేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు 376 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 1.18 కోట్లు అందించినట్లు నేతలు తెలిపారు. పేదల ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటూ ప్రభుత్వం ఈ సహాయం అందిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.