మోంథా తుఫాన్ ప్రభావంతో ఆదోని పట్టణం, మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. దీనితో రోడ్లు, వాహన మార్గాలు జలమయం అయ్యాయి. వాహనదారులు, ద్విచక్రవాహన యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పొలాల్లో నీరు నిల్వతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదోనిలో అక్రమ కట్టడాల కారణంగా ప్రధాన డ్రైనేజీలలో నీరు నిలిచిపోతోందని స్థానికులు తెలిపారు.