ఇస్వీ: సైబర్ నేరాలు, బాల్య వివాహం, రహదారి భద్రతపై అవగాహన

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు, శనివారం ఇస్వీ ఎస్సై మహేష్ కుమార్ ఆధ్వర్యంలో పాఠశాలలు, పట్టణాలు, గ్రామాల్లో విద్యార్థులకు మహిళలు, బాలల రక్షణ, సైబర్ నేరాలు, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. మహిళలపై నేరాలు, బాల్య వివాహం, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, పోలీస్ సేవల గురించి సూచనలు ఇచ్చారు. అనుమానాస్పద సంఘటనలు గమనిస్తే వెంటనే 112, 100, 1930 కు తెలియజేయాలని సూచించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పోలీసులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్