కర్నూలు జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆదివారం రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచనల మేరకు ఆదోని డివిజన్ పరిధిలోని పలు పోలీసు స్టేషన్లలో అధికారులు నేరచరిత్ర గలవారికి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. హితచింతనలో లేని వ్యక్తులు చట్టప్రకారం కఠిన చర్యలకు గురవుతారని హెచ్చరించారు.