కత్తితో దాడి: చెవి తెగి, యువకుడు ఆస్పత్రిపాలు

శుక్రవారం ఆదోని పరిధిలోని హనువాల్ గ్రామంలో తమన్నా అనే వ్యక్తిపై కత్తితో దాడి జరిగింది. ఈ దాడిలో అతని చెవి తెగిపోయింది. గ్రామానికి చెందిన కటిక ఇక్బాల్, తమన్నా మధ్య చికెన్ దుకాణం వద్ద జరిగిన గొడవ ఘర్షణకు దారితీసింది. ఇక్బాల్, తమన్నాపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. స్థానికులు తమన్నాని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెద్దతుంబలం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్