2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు కుటుంబాల విద్యార్థులను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో, టెన్త్‌లో 95 శాతానికి పైగా మార్కులు సాధించిన 14 మంది, ఇంటర్‌లో 95 శాతానికి పైగా మార్కులు సాధించిన 20 మంది విద్యార్థులకు అభినందన పత్రాలు, ఫాస్ట్‌ట్రాక్ వాచ్‌లను బహుమతులుగా అందజేశారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలే విద్యార్థుల భవిష్యత్ కెరీర్‌కు బలమైన పునాదిగా నిలుస్తాయని ఆయన తెలిపారు.