కర్నూలు: నేడు విద్యుత్ సమస్యలపై డయల్ యువర్ సీఎండీ

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి 'డయల్ యువర్ సీఎండీ' కార్యక్రమం ఈనెల 10న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ ఆదివారం తెలిపారు. రాయలసీమ జిల్లాల వినియోగదారులు 8977716661 నంబర్‌కు ఫోన్ చేసి తమ సమస్యలు తెలియజేయవచ్చు. అదనంగా టోల్‌ఫ్రీ నంబర్లు 1912, 180042515533 లేదా వాట్సప్‌ 9133331912 ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు.

సంబంధిత పోస్ట్