ఆదోనిలో మద్యం తాగి వాహనం నడిపిన దాదా ఖలందర్ (27) అనే యువకుడికి ఆదోని 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి 14 రోజుల పాటు జైలు శిక్ష విధించారు. సోమవారం ఆలూరు రోడ్డులో ఎస్సై మహేష్ కుమార్ నేతృత్వంలో జరిగిన తనిఖీల్లో యువకుడు పట్టుబడ్డాడు. డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా ఈ శిక్ష పడింది. మద్యం తాగి వాహనం నడిపేవారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు.