కర్నూలు: నీట్ పరీక్షను కట్టుదిట్టంగా నిర్వహించాలి: కలెక్టర్

మే 3న నిర్వహించనున్న నీట్ పరీక్షను ప్రశాంత వాతావరణంలో, కట్టుదిట్టంగా నిర్వహించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో, పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం, పరిశుభ్రత, గాలి, వెలుతురు, తాగునీటి సదుపాయాలు కల్పించాలని సూచించారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు జరుగుతుందని, విద్యార్థులు మధ్యాహ్నం 1:30 లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్