రాష్ట్ర ప్రభుత్వం యువత కోసం నిర్వహిస్తున్న జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకొని వారి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో జూలై 17న ఆదోనిలో ఏర్పాటు చేయనున్న జాబ్ మేళా కరపత్రాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఆదోని సాయిడిగ్రీ కళాశాలలో జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.