మదిరె: రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు విద్యార్థులు ఎంపిక

ఆదోని మండలం మదిరె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అలేఖ్య, సరస్వతి, లింగమూర్తి జిల్లాస్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. శనివారం పాఠశాలలో విద్యార్థులను హెచ్‌ఎం రంగన్న అభినందించారు. అలేఖ్య అండర్-14 పులివెందులలో, సరస్వతి, లింగమూర్తి అండర్-17 కాకినాడలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయుడు జి. ఈరన్నను కూడా అభినందించారు.

సంబంధిత పోస్ట్