బసరకోడులో వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

ఆదోని మండలంలోని బసరకోడు గ్రామానికి చెందిన హనుమంతు అనే వ్యక్తి శనివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బంధువులు, పరిచయస్తులు, సమీప గ్రామాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో, తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హనుమంతు ఆచూకీ తెలిసిన వారు 95059 98921 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్