బసాపురం: చెరువు పరిస్థితిపై ఎమ్మెల్యే పార్థసారథి ఆగ్రహం

ఆదోని మండలం బసాపురం చెరువు శిథిలమవుతోందని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి విమర్శించారు. బుధవారం ఆయన చెరువును పరిశీలించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే చెరువు అవస్థలో ఉందని అన్నారు. సీడీవో శివకుమార్‌ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో శాశ్వత మరమ్మత్తులు చేయలేమని, తాత్కాలిక మరమ్మత్తులు వేసవిలో చేపడతామన్నారు. అలాగే, డీపీఆర్‌ సిద్ధం చేసి, స్టోన్‌ రివిట్‌మెంట్‌ చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్