ఆదోని పట్టణంలో మంగళవారం, బోయగేరికి చెందిన వెంకటేష్ అనే యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. వన్ టౌన్ సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం, వెంకటేష్ ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని వెంటపడుతూ వేధించినట్లు ఆరోపణలున్నాయి. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.